‘భూత్పూర్’లో ఆరు వివాహాలకు బ్రేక్ | "Bhutpur 'six marriages break | Sakshi
Sakshi News home page

‘భూత్పూర్’లో ఆరు వివాహాలకు బ్రేక్

Apr 21 2016 1:54 AM | Updated on Sep 3 2017 10:21 PM

మండలంలోని పలు గ్రామాల్లో ఆరుగురు బాలికల బాల్యవివాహాలను అధికారులు అడ్డుకున్నా రు.

భూత్పూర్: మండలంలోని పలు గ్రామాల్లో ఆరుగురు బాలి కల బాల్యవివాహాలను అధికారులు అడ్డుకున్నా రు. వెల్కిచర్ల గ్రామానికి చెందిన ఓ బాలిక ఇంటర్‌మీడియట్ చదువుతోంది. ఆమెకు ఈనెల 23న పెళ్లిచేయాలని కుటుంబసభ్యులు నిశ్చయించారు. మరో బాలిక ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతుండగా.. ఈనెల 29న వివాహం నిర్ణయిం చారు.

అలాగే కొత్తమొల్గరకు చెందిన పదో తరగతి విద్యార్థినికి ఈనెల 27న పెళ్లి కుదుర్చారు. అలాగే కరివెన పంచాయతీ ముస్లాయిపల్లి తండాకు చెందిన బాలికకు ఈనెల 27న లగ్నం నిర్ణయించతలపెట్టారు. అలాగే కరివెనకు చెందిన బాలికకు ఈనెల 22న, తాటికొండలో మరో బాలికకు అదేరోజున పెళ్లిచేసేందుకు నిర్ణయించారు. ఆయా గ్రా మస్తులు కొందరు అధికారులకు సమాచారం ఇవ్వడంతో తహసీల్దార్ జ్యోతి, ఎస్‌ఐ అశోక్, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ అనిత వివాహాన్ని అడ్డుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement