మూఢ నమ్మకాలతో ​​​​​​​30ఏళ్లుగా చెట్టు కిందే మహాత్ముడు..

Believing In Superstitions Nawabpet Villagers Left Gandhi Statue Under A Tree - Sakshi

మహాత్మా మన్నించు..!

ఏర్పాటుచేయకుండానే శిథిలావస్థకు విగ్రహం

మూఢనమ్మకాలతో మర్రిచెట్టు కిందే వదిలేసిన వైనం

సాక్షి, జడ్చర్ల: ప్రజలనే కాదు.. చివరికి మహాత్ముడి విగ్రహాన్ని కూడా మూడనమ్మకాలు వెంటాడుతున్నాయి. దీంతో దాదాపు మూడు దశాబ్దాలుగా గాంధీ విగ్రహం ఏర్పాటుకు నోచుకోక.. పట్టించుకునే వారే కరువై చెట్టు కిందే శిథిలావస్థకు చేరింది. మండలంలోని గురుకుంటలో గాంధీ విగ్రహాన్ని ఏర్పాటుచేయాలని ఉపాధ్యాయులు, గ్రామస్తులు తెప్పించారు. ఈ క్రమంలో సదరు ఉపాధ్యాయుడు రోడ్డు ప్రమాదంలో గాయాలపాలయ్యాడు. దీంతో కీడు శంకించిన గ్రామస్తులు విగ్రహాన్ని గ్రామం నుంచి పోమాల్‌కి తరలించారు. అక్కడ సైతం విగ్రహ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్న తరుణంలో ఆ గ్రామ పెద్ద అనారోగ్యాంతో ఇబ్బందులు పడ్డాడు. దీంతో అక్కడ కూడా విగ్రహాన్ని ఏర్పాటుచేయకుండా మండల కేంద్రానికి తీసుకొచ్చారు.

30ఏళ్లుగా చెట్టు కిందే..
మండల కేంద్రంలో ఓ మర్రి చెట్టు కింద ఉన్న మహాత్ముడి విగ్రహాన్ని దాదాపు 30ఏళ్లుగా అలాగే వదిలేశారు. ప్రస్తుతం పెట్టిన చోటే శిథిలావస్థకు చేరింది. మూడ నమ్మకాలతో గాంధీజీ విగ్రహం ప్రతిష్టకు నోచుకోలేదంటే మారుమూల ప్రాంతాల్లో నమ్మకాలు ఎలా ఉన్నాయో ఇట్టే అర్థం అవుతుంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top