బీడీ కార్మికులుకు అందించే జీవన భృతిలో జాప్యం ప్రదిర్శిస్తున్నారని సర్పంచ్, పంచాయతీ కార్యదర్శిని బాధితులు నిర్బంధించారు.
ఆదిలాబాద్ : బీడీ కార్మికులుకు అందించే జీవన భృతిలో జాప్యం ప్రదిర్శిస్తున్నారని సర్పంచ్, పంచాయతీ కార్యదర్శిని బాధితులు నిర్బంధించారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా నేరేడుగొండ మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని కుమారి గ్రామంలో దాదాపు 100 మంది మహిళలు తమకు జీవనభృతి కల్పించాలంటూ పంచాయతీ కార్యాలయం ఎదుట భైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం సర్పంచ్, పంచాయతీ కార్యదర్శిని కార్యాలయంలో ఉంచి తాళం వేశారు.
(నేరేడుగొండ)