పూలకు సీతాకోక రెక్కలొచ్చాయ్‌.. | A Beautiful Butterflies On Plant Flowers In Mahabubabad | Sakshi
Sakshi News home page

పూలకు సీతాకోక రెక్కలొచ్చాయ్‌..

Aug 11 2019 8:39 AM | Updated on Aug 11 2019 8:39 AM

A Beautiful Butterflies On Plant Flowers In Mahabubabad - Sakshi

సాక్షి, మహబూబాబాద్‌ : పచ్చని చిలుకలు తోడుంటే.. పాడే కోయిల వెంటుంటే భూ లోకమే ఆనందానికి ఇల్లు.. లోకంలో కన్నీరింక చెల్లు .. సీతాకోక చిలుకకు చీరలెందుకు అనే పాట భారతీయుడు సినిమాలోనిది.. ఆ పాట వింటుంటే భూలోకమే స్వర్గంగా భావిస్తారు అందరు. గత పది రోజులుగా వర్షాలు కురియడంతో వివిధ రకాల పచ్చని చెట్లకు పూసిన పూలపై సీతాకోకచిలుకలు వాలుతూ భూలోకమే స్వర్గంగా మారిందా అన్నట్లుగా కనువిందు చేశాయి. పూలకు రెక్కలొచ్చినట్లుగా ఎగురుతూ పూలలోని మకరందాన్ని ఆస్వాదిస్తూ ఆనందాన్ని పంచాయి. మహబూబాబాద్‌  శివారు ప్రాంతంలో ఈ దృశ్యాలు ‘సాక్షి’కెమెరాకు చిక్కాయి.

1
1/4

2
2/4

3
3/4

4
4/4

Advertisement
 
Advertisement
Advertisement