సీఎన్‌జీ గ్యాస్ స్టేషన్ ఏర్పాటు చేయండి | bandaru dattatreya requests government for cng gas station | Sakshi
Sakshi News home page

సీఎన్‌జీ గ్యాస్ స్టేషన్ ఏర్పాటు చేయండి

May 1 2015 2:06 AM | Updated on Sep 3 2017 1:10 AM

వరంగల్‌లో సీఎన్‌జీ గ్యాస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు విజ్ఞప్తి చేశారు.

పెట్రో మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు బండారు విజ్ఞప్తి
 
 సాక్షి, న్యూఢిల్లీ: వరంగల్‌లో సీఎన్‌జీ గ్యాస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు విజ్ఞప్తి చేశారు. వరంగల్ నుంచి వచ్చిన ప్రతినిధి బృందంతో కలసి దత్తాత్రేయ గురువారం ధర్మేంధ్ర ప్రధాన్‌తో భేటీ అయ్యారు. అనంతరం వీరు కేంద్ర మంత్రి రాధామోహన్ సింగ్‌ను కలిశారు. అకాల వర్షంతో తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు. మరోవైపు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో దత్తాత్రేయ సమక్షంలో బీజేపీ ప్రతినిధి బృందం భేటీ అయ్యింది. 

 

వరంగల్‌లో సుగంధద్రవ్యాల (స్పైస్) పార్కు ఏర్పాటు చేయాలని కోరగా మంత్రి సానుకూలంగా స్పందించారు. మంత్రులను కలిసిన ప్రతినిధి బృందంలో మాజీ ఎమ్మెల్యే టి.రాజేశ్వరరావు, సత్యనారాయణరెడ్డి, వి.శ్రీరాములు, జైపాల్, ఎం.ధర్మారావు, సుమిత్, జి.రామ్మోహనరావు, విజయలక్ష్మీ తదితరులు ఉన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement