ప్రేమ విఫలమై.. జీవితంపై విరక్తి చెంది.. | Aversion to life belonged to the love-sick .. | Sakshi
Sakshi News home page

ప్రేమ విఫలమై.. జీవితంపై విరక్తి చెంది..

Dec 10 2014 4:31 AM | Updated on Nov 6 2018 8:04 PM

ప్రేమ విఫలమై.. జీవితంపై విరక్తి చెంది.. - Sakshi

ప్రేమ విఫలమై.. జీవితంపై విరక్తి చెంది..

జీవితంపై విరక్తి చెందిన ఓ ప్రేమ జంట ఘోరానికి ఒడిగట్టింది.

- రైలు కిందపడి ప్రేమికుడి ఆత్మహత్య
- విషయం తెలిసి విషం మింగిన ప్రియురాలు
- బాధితురాలి పరిస్థితి విషమం

జనగామ రూరల్ :జీవితంపై విరక్తి చెందిన ఓ ప్రేమ జంట ఘోరానికి ఒడిగట్టింది. ప్రేమికుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకోగా... ప్రేమికురాలు విషగుళికలు మింగి ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన జనగామ పట్టణంలో మంగళవారం జరిగింది. జనగామ పట్టణంలోని గుండ్లగడ్డకు చెందిన ఎల్లస్వామి, లలిత దంపతుల కుమారుడు మామిడిపల్లి సాగర్ (25) స్థానిక కళాశాలలో బీటెక్ పూర్తి చేశాడు.

సాగర్‌తోపాటు బీటెక్ పూర్తి చేసిన ధర్మకంచకు చెందిన ఓ యువతితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. పెళ్లి వరకు వచ్చిన క్రమంలో మంగళవారం ఇరు కుటుంబాల పెద్దలు నిశ్చితార్థం విషయమై మాట్లాడేందుకు సిద్ధమయ్యారు. ఇదే విషయంలో తలెత్తిన విభేదాల కారణంగా సాగర్ జనగామ-యశ్వాంతపూర్ మధ్య రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది.

అయితే మృతుడు సాగర్ వద్ద పోలీసులకు సూసైడ్ నోట్ లభించింది. దీనిపై రైల్వే ఎస్సై సీహెచ్.ఎల్లయ్యను సంప్రదించగా... సూసైడ్ నోట్‌లో ప్రేమ మాట నిజమేనని..పెళ్లి ఇష్టం లేకనే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఉందని తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న ప్రేమికురాలు విషగుళికలు మింగి అపస్మారక స్థితికి చేరుకుంది. యువతి పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement