మరో రెండు గంటల్లో పెళ్లి ముహూర్తం.
ఆదిలాబాద్: మరో రెండు గంటల్లో పెళ్లి ముహూర్తం.. పచ్చని తోరణాల మధ్య, మంగళ వాయిద్యాలతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టాల్సిన ఓ వ్యక్తి ఇంట విషాదం నెలకొంది. వరుడు సహా పెళ్లి బృందంతో వెళ్తున్న ఓ ఆటో ఆదిలాబాద్ జిల్లా కోటపల్లి మండలం సర్వాయిపేట వద్ద బుధవారం ఉదయం బోల్తా పడింది. ఈ ఘటనలో వరుడు ఎస్.మల్లేశ్ సహా ఐదుగురికి గాయలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు చెన్నూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
వారిలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా, మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించే ఏర్పాటు చేశారు. పెళ్లి బృందం జైపూర్ మండలం వేలాల గ్రామం నుంచి కోటపల్లి మండలం సీతంపల్లికి వెళ్లాల్సి ఉంది. సీతంపేటలో ఉదయం 10.30 గంటలకు పెళ్లి జరగాల్సి ఉంది.
(కోటపల్లి )