స్పీకర్‌ను కలసిన ‘ఆస్ట్రేలియా’ బృందం

'Australia' team met the speaker in Assembly - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆస్ట్రేలియా–తెలంగాణ పార్లమెంట్‌ సంబంధాల అధ్యయన యాత్రలో భాగంగా రాష్ట్రంలో పర్యటిస్తున్న ఆస్ట్రేలియా పార్లమెంట్‌ ప్రతినిధుల బృందం శాసనసభా స్పీకర్‌ మధుసూదనాచారిని కలిసింది.

శుక్రవారం స్పీకర్‌ చాంబర్‌లో ఆస్ట్రేలియా ఎంపీ ఆంథోని అల్బెన్స్‌ నేతృత్వంలోని బృందం ఆయనను కలసి వివిధ అంశాలపై చర్చించింది. చట్టసభల కార్యకలాపాల గురించి ఆ బృందం అడిగి తెలుసుకుంది. అనంతరం ప్రతినిధుల బృందాన్ని స్పీకర్, శాసన సభా కార్యదర్శి నర్సింహాచార్యులు సత్కరించారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top