9నుంచి కానిస్టేబుల్‌ అభ్యర్థుల ఫారాల స్వీకరణ

Attestation Forms Of Police Constables Will Be Accepted From Oct 9 - Sakshi

పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో అటెస్టేషన్‌ ఫారాల స్వీకరణకు ప్రత్యేక కౌంటర్ల ఏర్పాటు

సర్టిఫికెట్లూ తేవాల్సిందే

సాక్షి, ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి దరఖాస్తు చేసుకొని రాష్ట్ర పోలీస్‌ శాఖలోని వివిధ విభాగాల్లో కానిస్టేబుల్‌గా ఎంపికైన అభ్యర్థులకు సంబంధించిన అటెస్టేషన్‌ ఫారాలను పూరించి ఈ నెల 9,10,11,12వ తేదీలో ఖమ్మం పోలీస్‌ కమిషనరేట్‌ కేంద్రంలోని పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్‌లో అందజేయాలని ఖమ్మం పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయం నుంచి ఒక ప్రకటనలో తెలిపారు. గెజిటెడ్‌ అధికారితో అటెస్టేషన్‌ చేయించిన ఫారాలతో పాటు విద్యార్హతల ధ్రువీకరణ ఫారాలను అందజేయాలని కోరారు. అటెస్టేషన్‌ పారాల పంపకం, స్వీకరణకు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందని, ఆయా తేదీలలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఫారాలను స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. అభ్యర్థులు నాలుగు పాస్‌ఫోటోలను వెంట తీసుకరావాలని సూచించారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top