పెట్రోల్‌ బంకులపై కొరడా  | Attack on those Irregularities of Petrol Bunks | Sakshi
Sakshi News home page

పెట్రోల్‌ బంకులపై కొరడా 

Jul 14 2018 2:19 AM | Updated on Sep 3 2019 9:06 PM

Attack on those Irregularities of Petrol Bunks  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా అక్రమాలు, అవకతవకలకు పాల్పడుతున్న పెట్రోల్‌ బంకులపై తూనికలు కొలతల శాఖ కొరడా ఝుళిపించింది. పెట్రోల్‌ బంకుల మోసాలపై కొద్దీకాలంగా ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ఆ శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు జరిపారు. దాదాపు 70 బంకుల్లో తనిఖీలు చేయగా..నిబంధనలు ఉల్లంఘించిన 15 బంకులపై కేసులు నమోదు చేశారు. ఇందులో 12 బంకుల్లో డీజిల్‌ తక్కువగా పోస్తుండటం తోనూ , లైసెన్స్‌ రెన్యువల్‌ చేసుకోని మరో 3 బంకులపై కేసులు నమోదు చేశారు.

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని ఉప్పల్‌ దగ్గర ఉన్న ఐడీపీఎల్‌ ఫార్చ్యూన్‌ ఫ్యుయల్‌ హెచ్‌పీసీ పెట్రోల్‌ బంకులో అసిస్టెంట్‌ కంట్రోలర్‌ జగన్మోహన్‌ ఆధ్వర్యంలో తనిఖీలు జరిగాయి. ఇందులో 5 లీటర్ల డీజిల్‌కు 300 ఎంఎల్‌ తక్కువగా పోస్తున్నారని గుర్తించి కేసు నమోదు చేశారు. పెట్రోల్‌ బంకుల్లో మోసాలకు పాల్పడితే  కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement