జూబ్లీహిల్స్లో వ్యభిచార గృహాలవారి ఆగడాలు! | Attack on conistables | Sakshi
Sakshi News home page

జూబ్లీహిల్స్లో వ్యభిచార గృహాలవారి ఆగడాలు!

Jun 22 2014 7:32 PM | Updated on Mar 19 2019 9:03 PM

జూబ్లీహిల్స్లో వ్యభిచార గృహాలవారు రెచ్చిపోతున్నారు.

హైదరాబాద్:  జూబ్లీహిల్స్లో వ్యభిచార గృహాలవారు రెచ్చిపోతున్నారు. వారు పోలీసులపై కూడా దాడి చేసే స్థాయికి చేరారు. వారిని అలాగే వదిలివేస్తే ముందు ముందు వారు ఏ స్థాయికి ఎదిగిపోతారో ఊహించుకోవచ్చు. వ్యభిచార గృహాలపై దాడి చేసేందుకు వెళ్లిన ఇద్దరు జూబ్లీహిల్స్ కానిస్టేబుల్స్‌పై  కొందరు దుండగులు  దాడి చేశారు.

ఈ దాడిలో ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడినవారిలో అడిషనల్ డీసీపీ గన్‌మేన్‌ కూడా ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement