నారాయణ్‌ఖేడ్‌లోని బసవేశ్వరం చౌక్ వద్ద సోమవారం తెల్లవారుజామున నెంబర్ వన్ ఏటీఎం మెషిన్‌ను గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు.
నారాయణ్‌ఖేడ్‌లోని బసవేశ్వరం చౌక్ వద్ద సోమవారం తెల్లవారుజామున నెంబర్ వన్ ఏటీఎం మెషిన్‌ను గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. దుండగులు ఏటీఎం మెషిన్‌ను గడ్డపార, పలుగుతో పెకలించడానికి ప్రయత్నించారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఎంత మొత్తంలో నగదు చోరీ జరిగిందనే వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.