భారీగా నగదు పట్టివేత | Sakshi
Sakshi News home page

భారీగా నగదు పట్టివేత

Published Mon, Mar 17 2014 2:02 AM

భారీగా నగదు పట్టివేత - Sakshi

 నాగిరెడ్డిపేట, న్యూస్‌లైన్: వేర్వేరు ప్రాంతాల్లో పోలీసులు నిర్వహించిన వాహనాల తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడింది. నాగిరెడ్డిపేట మండలంలోని తాండూరు గేట్ సమీపంలో ఆదివారం వాహనాల తనిఖీ చేపట్టిన ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు శ్రీనివాస్, అనిల్ రూ. 2.89 లక్షల నగదును పట్టుకున్నారు.
 
  సిద్దిపేటకు చెందిన దేశభక్తి శివ అనేవ్యక్తి తన వాహ నంలో ఎల్లారెడ్డి నుంచి మెదక్ వెళ్తుండగా అధికారులు శివ వాహనాన్ని తనిఖీ చేశారు. ఈ క్రమంలో వ్యాన్‌లో ఉన్న నగదును స్వాధీనం చేసుకున్నారు. కోడిగుడ్లను విక్రయించగా వచ్చిన డబ్బును వ్యాన్‌లో తీసుకు వెళ్తుండగా అధికారులు పట్టుకున్నారని బాధితుడు శివ తెలిపారు.
 
 
 రూ. 2.17 లక్షలు
 బాల్కొండ: ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సందర్భంగా మండలంలోని చాకీర్యాల్ చెక్‌పోస్ట్ వద్ద వివిధ వాహనాల తనిఖీల్లో 2.17 లక్షల నగదును శనివారం రాత్రి  పట్టుకున్నట్లు ఎస్సై సురేష్ తెలిపారు. నగదుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు చూపకపోవడంతో నగదును సీజ్ చేసి ఎన్నికల అధికారులకు అప్పగించినట్లు పేర్కొన్నారు.
 
 
 రూ. 2 లక్షల 45 వేలు
 సదాశివనగర్: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలవద్ద 44వ జాతీయ రహదారిపై ఆదివారం ఫ్లయిం గ్ స్వ్కాడ్ బృందం వాహనాలను తనిఖీ చేసి రూ. 2 లక్షల 45వేల నగదును పట్టుకున్నారు.
 
 ఎంహెచ్ 40వై 5242 నం బరు గల మహరాష్ట్రకు చెందిన ఆర్‌టీసీ బస్సులో రూ. 95 వేలు తరలిస్తున్న ఆసమహ్మద్ వద్ద డబ్బుకు సంబంధించి ఆధారాలు లేకపోవడంతో స్వాధీనం చేసుకున్నామని అధికారులు పేర్కొన్నారు.
 
  అలాగే టర్బో వాహనంలో రూ. లక్షా 50వేలు తరలిస్తున్న మహ్మద్ ఉస్మాన్ నుంచి డబ్బును స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. స్వాధీనం చేసుకున్న డబ్బును జిల్లా ఖజానాకు పంపిస్తున్నట్లు బృందం ప్రతినిధులు ప్రేమ్‌కుమార్, ఏఎస్సై జేవీఆర్ నర్సయ్య, సిబ్బంది తెలిపారు.
 
 సాలూర చెక్ పోస్టు వద్ద రూ.1.60 లక్షలు
 బోధన్ టౌన్: మండల శివారులోని అంధ్ర- మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన సాలుర చెక్ పోస్టు వద్ద ఆదివారం పోలీసులు నిర్వహించిన వాహనాల తనిఖీల్లో రూ. 1.60 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు బోధన్ సీఐ రామకృష్ణ తెలిపారు.
 
  మహారాష్ట్రలోని నాందేడ్ నుంచి బోధన్ వైపు వస్తున్న డీసీఎం వ్యాన్ తనిఖీ చేయగా ఇద్దరి వ్యక్తుల వద్ద రూ. 1.60 వేలు ఉన్నాయని, వారివద్ద నగదుకు సంబంధించి ఎలాంటి రశీదులు లేకపోవడంతో డబ్బును స్వాధీనం చేసుకున్నట్లు సీఐ పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement