అసెంబ్లీ భేటీ, భద్రతపై  మండలి చైర్మన్‌ సమీక్ష  | Assembly meetings Chairman Swamigoud on security arrangements | Sakshi
Sakshi News home page

అసెంబ్లీ భేటీ, భద్రతపై  మండలి చైర్మన్‌ సమీక్ష 

Jan 15 2019 4:02 AM | Updated on Jan 15 2019 4:02 AM

Assembly meetings Chairman Swamigoud on security arrangements - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఈ నెల 17 నుంచి నిర్వహించనున్న అసెంబ్లీ సమావేశాలు, భద్రతా ఏర్పాట్లపై మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌ నేతృత్వంలోని బృందం సోమవారం సమీక్షించింది. శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులు, డీజీపీ మహేందర్‌రెడ్డి, నగర కమిషనర్‌ అంజనీకుమార్, స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ ఉన్నతాధికారులు, ట్రాఫిక్, ఫైర్‌ విభాగాల ఉన్నతాధికారులు సమీక్షలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో పోలీస్‌ ఉన్నతాధికారులు అసెంబ్లీ, మండలి ప్రాంగణాలను పరిశీలించి సీఎం, వీఐపీల అలైంటింగ్‌ పాయింట్లు, వాటి భద్రత, అసెంబ్లీ లోపల, బయట ఎంత మంది సిబ్బందిని భద్రతలో నిమగ్నం చేయాలన్న దానిపై చర్చించారు. అదే విధంగా ట్రాఫిక్‌సమస్య తలెత్తకుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ముందు జాగ్రత్తగా అగ్నిమాపక సిబ్బంది అందుబాటులో ఉండాలని సూచించారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement