ఆర్మీ జవాన్ ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

ఆర్మీ జవాన్ ఆత్మహత్య

Published Wed, Oct 8 2014 1:31 AM

ఆర్మీ జవాన్ ఆత్మహత్య - Sakshi

గుడిహత్నూర్ : జైనథ్ మండలం గూడరాంపూర్ గ్రామానికి చెందిన ఏదుల్ల రవి(25) అనే ఆర్మీ జవాన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తండ్రి ఏదుల్ల చంద్రయ్య కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. రవి మూడేళ్ల క్రితం ఆర్మీలో చేరాడు. ఈ ఏడాది జూన్ 4న ఆదిలాబాద్‌లోని శాంతినగర్‌కు చెందిన స్వప్నతో వివాహమైంది. త ర్వాత కొన్ని రోజుల నుంచి ఉద్యోగ రీత్యా, పంజాబ్, శ్రీనగర్‌లో ఉంటున్నాడు. 20 రోజుల కిందట సెలవు పెట్టి గూడరాంపూర్‌కు వచ్చిన రవి ఈసారి తన భార్య స్వప్ప కూడా వెంట తీసుకెళ్తానన్నాడు. కానీ దీనికి ఆమె నిరాకరించింది. దీంతో ఇంట్లో గొడవలు అవుతున్నాయి.

ఈ క్రమంలో సోమవారం ఉదయం భార్యను ఆమె పుట్టింట్లో దించిన రవి ఇంటి నుండి మోటార్ సైకిల్‌పై తన భార్యను తీసుకొని ఆదిలాబాద్‌లోని అత్తవారింట్లో దింపేశాడు. గుడిహత్నూర్ మండలంలోని సీతాగొంది గ్రామ పెట్రోల్ పంపు సమీపంలో జాతీయ రహదారి పక్కనే పురుగుల మంది తాగి ఆత్మహత్య చేసుకుని విగతజీవిగా ఉన్నాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు వచ్చి పరిశీలించారు. మోటారు సైకిల్, పురుగులమందు డబ్బా, ఏటీఎం కార్డు, డబ్బులు లభించాయి. కోడలు కొడుకుతో కాపురానికి వెళ్లనందునే రవి ఆత్మహత్య చేసుకున్నాడని అతడి తల్లిదండ్రులు రోదించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement