జిల్లా ఆస్పత్రిలో వైద్యుల నియామకం

The Appointment Of Physicians In The District Hospital - Sakshi

తాండూరు వికారాబాద్‌ :  తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో ఏడుగురు సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్లు గురువారం విధుల్లో చేరారు. ఈ నెల 14న సాక్షి దిన పత్రికలో ‘రోగులు ఫుల్‌.. సేవలు నిల్‌’ రోగం కుదిరేదెప్పుడో అనే శీర్షికలతో ప్రచురితమైన కథనానికి వైద్యశాఖలో చలనం వచ్చింది.

వైద్య విధాన పరిషత్‌ రెండు రోజుల క్రితం వైద్య అభ్యర్థుల నుంచి ఉద్యోగాల కోసం దరకాస్తు చేసుకున్న వారికి సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్లుగా నియమిస్తూ ఆన్‌లైన్‌ ద్వారా అభ్యర్థులకు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి నియమితులైన ఏడుగురు సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్లు గురువారం విధుల్లో చేరారు.

ఈనెల 23వ తేదీ వరకు విధుల్లో చేరాలని గడువు విధించడంతో మరో 20 మంది వరకు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి రానున్నట్లు వైద్యశాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. అందులో కొందరు తాండూరులో ఉన్న జిల్లా ఆస్పత్రిలో విధులు నిర్వహించేందుకు సుముఖత చూపడం లేదని ప్రచారం జరుగుతోంది. సోమవారంలోగా ఆస్పత్రిలో ఎంతమంది వైద్యులు విధుల్లో చేరుతారనేది స్పష్టత వస్తుంది.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top