‘అంతర్రాష్ట్ర బదిలీ’ దరఖాస్తుల గడువు పొడిగింపు | Application deadline extension to Inter-state transfer | Sakshi
Sakshi News home page

‘అంతర్రాష్ట్ర బదిలీ’ దరఖాస్తుల గడువు పొడిగింపు

Nov 11 2017 5:31 AM | Updated on Nov 11 2017 5:31 AM

సాక్షి, హైదరాబాద్‌: ఏపీ, తెలంగాణ మధ్య స్టేట్‌ కేడర్‌ ఉద్యోగుల అంతర్రాష్ట్ర, పరస్పర బదిలీల కోసం ఉద్యోగుల నుంచి దరఖాస్తుల స్వీకరణను 2018 జూన్‌ వరకు పొడిగించాలని ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు నిర్ణయించాయి. విభజన అనంతరం ఇరు రా ష్ట్రాల మధ్య పెండింగ్‌లో ఉన్న వివాదాలు, సమస్యల సత్వర పరిష్కారం కోసం తెలంగాణ ప్రభుత్వ ప్రధా న కార్యదర్శి ఎస్పీ సింగ్, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్‌ కుమార్‌ శుక్రవారం సచివాలయంలో స మావేశమై ఈ మేరకు పలు నిర్ణయాలు తీసుకున్నారు. హా భూములు, భవనాలు లేని షెడ్యూల్డ్‌–10 సంస్థల విభజనను త్వరగా పూర్తి చేయాలి.
 
ఢిల్లీలోని ఏపీ భవన్‌ ఆస్తుల విభజనను త్వరగా పూర్తి చేయాలి.
షెడ్యూల్‌–9లోని సంస్థల ఉద్యోగులు, ఆస్తులు, అప్పుల విభజన అంశంపై షీలా బిడే కమిటీ సిఫారసులను ఆమోదించాలి.
ఇరు రాష్ట్రాల మధ్య కార్మిక పన్ను విభజనను త్వరగా పూర్తి చేయాలి.
విద్యుత్‌ సంస్థలకు సంబంధించిన బకాయిలను త్వరగా పరిష్కరించాలి.
ఏపీ అడ్మినిస్ట్రేటివ్‌ ట్రిబ్యునల్‌ తరహాలోనే లోకాయుక్త ఉద్యోగుల విభజనను సత్వరంగా జరపాలి.
ఏపీ, తెలంగాణల్లో ఒక రాష్ట్ర స్థానికత కలిగి, తమ సొంత రాష్ట్రాన్ని కోరుకున్నప్పటికీ మరో రాష్ట్రానికి కేటాయించిన స్టేట్‌ కేడర్‌ ఉద్యోగులను వారి అభీష్టం మేరకు రెండు రాష్ట్రాలు సమాన సంఖ్యలో పరస్పరం ఎక్స్‌ఛేంజ్‌ చేసుకోవాలి.

కేటాయింపులకు ఉప కమిటీ
ఇరు రాష్ట్రాల మధ్య స్టేట్‌ కేడర్‌ ఉద్యోగుల పంపకాలను పూర్తి చేయాలని కేంద్ర ఉద్యోగులు, సిబ్బంది వ్యవహారాల శాఖ కార్యదర్శి అజయ్‌ మిట్టల్‌ నేతృత్వంలోని స్టేట్‌ అడ్వైజరీ కమిటీ నిర్ణయం తీసుకుంది. సచివాలయంలో జరిగిన కమిటీ సమావేశంలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల సీఎస్‌లు ఎస్పీ సింగ్, దినేశ్‌ కుమార్‌ పాల్గొన్నారు. పోలీ సు శాఖలో డీఎస్పీ, ఎక్సైజ్‌ శాఖలో సూపరింటెం డెంట్ల సీనియారిటీని ఖరారు చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించారు. డిప్యూటీ కలెక్టర్లు, పోలీసు శాఖలోని డీఎస్పీలు, ఎౖMð్సజ్‌ శాఖలోని సూపరింటెండెంట్ల కేటా యింపు ప్రక్రియను పూర్తి చేసేందుకు రాష్ట్ర సలహా సంఘం ఆధ్వర్యంలో ఉప కమిటీ ఏర్పాటు చేయాల ని నిర్ణయించారు. కేంద్ర ఉద్యోగులు, సిబ్బంది వ్యవహారాల శాఖ జాయింట్‌ సెక్రటరీ కింబంగ్‌ కెన్‌ నేతృత్వం వహించే ఈ ఉప కమిటీలో తెలంగాణ రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణ సభ్యుడిగా, ఏపీ రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ రిటైర్డు ముఖ్య కార్యదర్శి ఎల్‌.ప్రేమచంద్రారెడ్డి మెం బర్‌ కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు. కేంద్రం తుది కేటాయింపులు జరిపిన తర్వాత ఉద్యోగులు  వేరే రాష్ట్రానికి కేటాయించాలని విజ్ఞప్తి పెట్టుకుంటే సదరు విజ్ఞప్తులను 2 రాష్ట్రాల ప్రభుత్వాలు సంప్రదింపుల ద్వారా పరిష్కరించాలని నిర్ణయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement