బీసీ రుణాల దరఖాస్తు గడువు పెంచాలి | The application of BC loans should be increased | Sakshi
Sakshi News home page

బీసీ రుణాల దరఖాస్తు గడువు పెంచాలి

Apr 3 2018 8:42 AM | Updated on Apr 3 2018 8:42 AM

The application of BC loans should be increased - Sakshi

వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చిన నాయకులు  

తాండూరు రూరల్‌: బీసీ రుణాల దరఖాస్తుల గడువు పెంచాలని ఆ సంఘం నాయకులు సోమవారం డిమాండ్‌ చేశారు. ఈనెల 4వ తేదీతో బీసీ రుణాల దరఖాస్తు ముగుస్తోందని తెలిపారు.  సమయం తక్కువగా ఉండటంతో కులం, ఆదాయం సర్టిఫికెట్లలో తీవ్ర జాప్యం జరుగుతుందని అవేదన వ్యక్తం చేశారు. ఈవిషయంలో ఉన్నతాధికారులు దృష్టిసారించి దరఖాస్తుల గడువు పెంచాలని కోరారు. అనంతరం తహసీల్దార్, ఎంపీడీఓలకు వినతిపత్రాలు ఇచ్చేందుకు యత్నించగా అధికారులు అందుబాటులో లేకపోవడంతో వెనుదిరిగి వెళ్లిపోయారు. ఈ కార్యక్రమంలో నాయకులు వడ్డె కృష్ణ, అమ్రేష్, రమేష్, వెంకటేష్, నర్సింలు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement