నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఏసీబీ అధికారులు గురువారం ఉదయం నుంచి తనిఖీలు నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్: నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఏసీబీ అధికారులు గురువారం ఉదయం నుంచి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా కడెం మండలంలోని దుస్తురాబాద్‌లోని బీసీ బాలుర వసతి గృహంలో ఏసీబీ అధికారులు రికార్డులు తనిఖీచేసి వాటిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే నిజామాబాద్ జిల్లా జుక్కల్ మండలంలోని కౌలాస్ గిరిజన సంక్షేమ వసతి గృహంలో ఏసీబీ డీఎస్పీ నరేంద్ర రెడ్డి ఆధ్వరంలో సోదాలు జరిగాయి. తనిఖీలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.