కలెక్టర్‌గా ఏడాది | Sakshi
Sakshi News home page

కలెక్టర్‌గా ఏడాది

Published Wed, Jun 18 2014 2:02 AM

కలెక్టర్‌గా ఏడాది - Sakshi

కలెక్టరేట్ : కలెక్టర్‌గా అహ్మద్‌బాబు బాధ్యతలు స్వీకరించి బుధవారంతో ఏడాది అయింది. అప్పటి కలెక్టర్ అశోక్ నుంచి 2013 జూన్ 18న అహ్మద్ బాబు జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు తూర్పుగోదావరిలో జేసీగా పని చేశారు. కలెక్టర్‌గా జిల్లాకు వచ్చిన ఏడాదిలోనే పాలనలో తనదైన ముద్రవేశారు. అధికారులు, ఉద్యోగుల్లో క్రమశిక్షణతోపాటు విధుల నిర్వహణలో సమూల మార్పు లు తీసుకొచ్చారు. క్రమశిక్షణ లేని అధికారులను సరెండర్ చేశారు. ఆక్రమణల తొలగింపులో తనదైన ముద్రవేశారు.
 
నగదు బదిలీ, ఐరీష్ విధానం ద్వారా పింఛన్ల పంపిణీ, ఉపాధి హామీ పథకం అమలులో జా తీయ స్థాయి అవార్డు, ఆధార్ కార్డుల నమోదులో దేశంలోనే మొదటి స్థానం, ప్రజా ఫిర్యాదుల స్వీకరణకు జీఎంఎస్ విధానం ప్రవేశపెట్టిన ఘనత కలెక్టర్‌కే దక్కుతుంది. 2014 జనవరి నుంచి ప్రజా ఫిర్యాదులను ఆన్‌లైన్ ద్వారా స్వీకరించే విధానం గ్రీవెన్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్(జీఎంఎస్) తీసుకువచ్చారు. ఫిబ్రవరి 2, 2014న అప్పటి కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి జైరాం రమేష్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. 2014లో జరిగిన స్థానిక, మున్సిపల్, సార్వత్రిక ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించినందుకుగాను అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహాంతి కలెక్టర్‌కు ప్రశంసలు తెలిపారు.

Advertisement
Advertisement