ఆస్ట్రేలియా సహకరించాలి: సీఎస్‌

Agriculture and IT training Australia should cooperate in the fields - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: భారత్‌తో విద్య, వ్యవసాయం, ఐటీ శిక్షణ తదితర రంగాల్లో సహకారానికి ఆస్ట్రేలియా సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) ఎస్‌.కె.జోషి అన్నారు. ఈ మేరకు బుధవారం సీఎస్‌ను ఆస్ట్రేలియా బృందం కలిసింది. ఈ సందర్భంగా జోషి మాట్లాడుతూ ఆస్ట్రేలియా, భారత్‌ సహకారంతో రాష్ట్రాల మధ్య విద్య, ఉపాధి రంగాల్లో సహకారానికి విస్తృత అవకాశాలున్నాయని, ఆయా రంగాల్లో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి కార్యాచరణను రూపొందించాల్సిన అవసరం ఉందని అన్నారు. కాగా, విపత్తు నిర్వహణ, విద్య, వ్యవసాయం తదితర రంగాల్లో సహకారం అందించడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు ఆస్ట్రేలియా నార్తర్న్‌ టెరిటరీ విద్యా మంత్రి సెలెనా యూఈబో అన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top