లోపాలున్నా అఫిలియేషన్! | affiliation | Sakshi
Sakshi News home page

లోపాలున్నా అఫిలియేషన్!

Sep 5 2014 1:02 AM | Updated on Sep 4 2018 5:07 PM

ప్రమాణాలు పాటించడం లేదంటూ పలు ఇంజనీరింగ్ కాలేజీలకు అఫిలియేషన్ రద్దు చేసిన జేఎన్‌టీయూహెచ్.. మరికొన్ని కాలేజీలను ప్రమాణాలు పాటించకపోయినా వెబ్‌కౌన్సెలింగ్‌కు అనుమతించినట్లు తాజాగా వెలుగుచూసింది.

సాక్షి, హైదరాబాద్: ప్రమాణాలు పాటించడం లేదంటూ పలు ఇంజనీరింగ్ కాలేజీలకు అఫిలియేషన్ రద్దు చేసిన జేఎన్‌టీయూహెచ్.. మరికొన్ని కాలేజీలను ప్రమాణాలు పాటించకపోయినా వెబ్‌కౌన్సెలింగ్‌కు అనుమతించినట్లు తాజాగా వెలుగుచూసింది.  ఆ తప్పును దిద్దుకునేందుకు వర్సిటీ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఎక్కడ పొరపాటు జరిగిందో తెలుసుకునేందుకు గురువారం మధ్యాహ్నం సమావేశమైన వర్సిటీ స్టాండింగ్ కమిటీ సభ్యులు సుదీ ర్ఘంగా చర్చించారు. కాలేజీల్లో నిర్వహించిన తని ఖీల రిపోర్టులను, నోటీసులను అర్ధరాత్రి వరకూ పరిశీలించారు. ఈ ప్రక్రియ కొలిక్కి రాకపోవడంతో శుక్రవారం కూడా దీన్ని కొనసాగించాలని నిర్ణయించారు. ఎంసెట్ కౌన్సెలింగ్ సందర్భం గా ప్రమాణాలు పాటించలేదంటూ 174 ఇంజినీరింగ్ కాలేజీలను దూరంగా ఉంచిన సంగతి తెలి సిందే.

 

ఈ నేపథ్యంలో లోపాలున్న కాలేజీలను ఏవిధంగా మొదటి విడత కౌన్సెలింగ్‌కు అనుమతించారో, అలాగే మలిదశ కౌన్సెలింగ్‌కు, పీజీ ఈసెట్ కౌన్సెలింగ్‌కూ తమనూ అనుమతించాలని పలు యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నా యి. రంగారెడ్డి జిల్లా పరిధిలోని కొన్ని ఇంజనీరింగ్ కాలేజీల్లో కేడర్ రేషియో, ఫ్యాకల్టీ ర్యాటిఫికేషన్, స్పెషలైజేషన్లు, ఏఐసీటీఈ వేతన స్కేలు అమలు, ఫ్యాకల్టీ వయస్సు, బోధనా సిబ్బంది కొరత, టీచింగ్ స్టాఫ్‌ను అడ్మినిస్ట్రేషన్‌కు వినియోగించడం తదితర ఏడు అంశాల్లో లోపాలున్నట్లు గుర్తించిన కాలేజీలనూ వెబ్ కౌన్సెలింగ్‌కు అనుమతించారని బాధిత యాజమాన్యాలు ఆరోపిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement