ఆగస్టు నుంచి వెటర్నరీ కళాశాలలో అడ్మిషన్లు

Admissions in Veterinary College since August - Sakshi

భీమదేవరపల్లి: ఆగస్టు మాసం నుంచి జిల్లాలోని  మామునూర్‌ వెటర్నరీ కళాశాలలో అడ్మిషన్లు జరిగే అవకాశాలు ఉన్నాయని వీసీఐ (వెటర్నరీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా) బృంద చైర్మన్‌ డాక్డర్‌ జేవీ రమణ, సభ్యులు డాక్డర్‌ ఉషా కుమారి, డాక్టర్‌ ఎస్‌ ఎస్‌ చోప్టే తెలిపారు. మండలంలోని కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయంలో బుధవారం వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అనంతరం వరంగల్‌ అర్బన్‌ జిల్లా మామునూర్‌లో వెటర్నరీ కళాశాల మంజూరు అయినట్లు కళాశాల నిర్మాణం కోసం రూ. 370 కోట్లు సైతం మంజూరు చేసినట్లు తెలిపారు. పోలీస్‌ హౌసింగ్‌ శాఖ ఆధ్వర్యంలో ఈ నిర్మాణాలు చేపడుతున్నట్లు వివరించారు.

కళాశాలలో ఏర్పాట్లు, వసతులు తదితర వాటిని పరిశీలించామని, నివేదికను హైదరాబాద్, ఢిల్లీ అధికారులకు పంపినట్లు వారు వెల్లడించారు. దాదాపుగా ఆగస్టులో కళాశాలలో అడ్మిషన్‌లు జరిగే అవకాశాలున్నట్లు వారు చెప్పారు. వారి వెంట పీవీఆర్, వీరోజీరావు, నర్సింగరెడ్డి, ప్రదీప్, ఆలయ ఈఓ హరిప్రకాష్‌రావు, అర్చకులు తాటికొండ వీరభద్రయ్య, రాజన్న, రాంబాబు ఉన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top