మావోయిస్టు పార్టీ అగ్రనేత ఆజాద్ ఎన్కౌంటర్పై అనుమానం వ్యక్తంచేస్తూ ఘటనకు సంబంధమున్న పోలీసులను విచారించాల్సిందిగా ఆయన భార్య పద్మ దాఖలు చేసిన పిటిషన్ను మంగళవారం ఆదిలాబాద్ జిల్లా కోర్టు కొట్టేసింది.
మావోయిస్టు పార్టీ అగ్రనేత ఆజాద్ ఎన్కౌంటర్పై అనుమానం వ్యక్తంచేస్తూ ఘటనకు సంబంధమున్న పోలీసులను విచారించాల్సిందిగా ఆయన భార్య పద్మ దాఖలు చేసిన పిటిషన్ను మంగళవారం ఆదిలాబాద్ జిల్లా కోర్టు కొట్టేసింది. తీర్పుపై స్పంచిందిన పద్మ.. ఆదిలాబాద్ కోర్టు తీర్పును హైకోర్టులో సవాల్ చేస్తానని తెలిపారు. బూటకపు ఎన్కౌంటర్లో పాల్గొన్న 29 మంది పోలీసులపై చర్యలు తీసుకునేవరకు పోరాటం ఆపేదిలేదని స్పష్టంచేశారు.
2010లో ఆదిలాబాద్ జిల్లాలోని అటవీప్రాంతంలో ఆజాద్ సహా జర్నలిస్ట్ హేమచంద్రపాండే పోలీసుల ఎన్కౌంటర్లో హతమయ్యారు. అయితే అది బూటకపు ఎన్కౌంటర్ అని, వారిద్దరినీ సజీవంగా పట్టుకొని చిత్రహింసలు చేసిన అనంతరం చంపారని పలు హక్కుల సంఘాలు ఆరోపించాయి. న్యాయవిచారణ చేయాలని కోరుతూ ఆందోళనలు నిర్వహించిన సంగతి తెలిసిందే.