విచారణకు హాజరుకాని శివాజీ

Actor Shivaji Not Attend For Police Enquiry Over Alanda Media Case - Sakshi

కుమారుడిని అమెరికాకు పంపే ఏర్పాట్లలో ఉన్నట్లు వెల్లడి 

సాక్షి, హైదరాబాద్‌ : అలంద మీడియా కేసులో నిందితుడిగా ఉన్న సినీ నటుడు, గరుడ పురాణం శొంఠినేని శివాజీ గురువారం సైబరాబాద్‌ పోలీసుల ముందు విచారణకు హాజరుకాలేదు. ఈ నెల 1న హైదరాబాద్‌ నుంచి అమెరికా వెళ్లే ప్రయత్నంలో శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో పట్టుబడిన విషయం తెలిసిందే. 11న విచారణకు హజరుకావాలంటూ పోలీసులు శివాజీకి నోటీసులిచ్చారు. దీని ప్రకారం గచ్చిబౌలిలోని సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసుల ఎదుట శివాజీ గురువారం విచారణకు హజరుకావాల్సి ఉంది. అయితే తన కుమారుడిని అమెరికాలో చదువులకు పంపడంలో నిమగ్నమై ఉన్నందున విచారణకు హాజరుకాలేకపోతున్నానని శివాజీ పోలీసులకు ఈమెయిల్‌ పంపారు. దీనికి అనుమతించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్‌ కూడా దాఖలు చేశానని తెలిపారు. అయితే మరోసారి నోటీసులు జారీ చేసి తదుపరి చర్యలకు ఉపక్రమించాలని పోలీసులు భావిస్తున్నట్లు తెలిసింది.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top