ఈ నెల 23న నగరంలో కలకలం రేపిన మహిళ సజీవదహనం కేసులో నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
హైదరాబాద్ : ఈ నెల 23న నగరంలో కలకలం రేపిన మహిళ సజీవదహనం కేసులో నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం... మృతురాలు శ్రీదేవి, నిందితుడు శివ బోడుప్పల్ లోని ఒక ప్రైవేటు స్కూల్లో భాగస్వాములుగా ఉన్నారు. అయితే పాఠశాల నిర్వహణలో తలెత్తిన విభేదాల కారణంగా శివ ఈ నెల 23న శ్రీదేవిని సజీవదహనం చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు తమ దర్యాప్తులో శివను నిందితుడిగా తేల్చారు. శుక్రవారం ఉదయం నిందితుడు శివను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.