సీఐ భూమయ్య ఇంట్లో ఏసీబీ సోదాలు | ACB Searches at CI House | Sakshi
Sakshi News home page

సీఐ భూమయ్య ఇంట్లో ఏసీబీ సోదాలు

Jul 20 2018 1:55 PM | Updated on Aug 17 2018 12:56 PM

ACB Searches at CI  House - Sakshi

భూమయ్య ఇంట్లో సోదాలు చేస్తున్న ఏసీబీ అధికారులు  

కరీంనగర్‌క్రైం: భూమిని కొనుగోలు చేయడానికి వెళ్తున్న అదిలాబాద్‌ ట్రాఫిక్‌ సీఐ దాసరి భూమయ్యను హైదరాబాద్‌లోని ఔటర్‌రింగ్‌ రోడ్డు వద్ద గురువారం ఏసీబీ అధికారులు తనిఖీ చేశారు. అతని వద్ద నుంచి లెక్కకురాని రూ.10లక్షలు, భూమికి సంబంధించిన రూ.15లక్షల విలువైన పేపర్లు స్వాధీనం చేసుకున్నారు.

వాటిని గురించి సరైన సమాధానం చెప్పకపోవడంతో సీఐ భూమయ్యను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. కరీంనగర్‌లోని భూమయ్య ఇంట్లో జగిత్యాల, అదిలాబాద్, కరీంనగర్, హైదరాబాద్‌లోని వారి బంధువుల ఇళ్లలో ఏసీబీ డీఎస్పీ కిరణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో సోదాలు చేశారు. ఈ సందర్భంగా పలు ఆస్తులను గుర్తించినట్లు తెలిసింది.  

అది నుంచి వివాదాలతోనే.. 

పోలీస్‌శాఖలో దాసరి భూమయ్యకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. సామాన్యుడికి న్యాయం చేస్తారని నేతలు, అధికారులు ఒత్తిళ్లను పట్టించుకోరని పేరుంది. గతంలో ఓ ఎస్పీ తనను అకారణంగా వేధింపులకు గురి చేస్తున్నాడని ప్రెస్‌మీట్‌లో బహటంగానే ప్రకటించారు.కొద్దిరోజులుగా డీఎస్పీగా పదోన్నతి కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఏసీబీకి పట్టుబడ్డారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement