మహబూబ్‌నగర్ జిల్లా వంగూర్ మండలంలోని ఉమ్మాపూర్ గ్రామ వీఆర్‌ఓ భీమయ్య లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు.
మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా వంగూర్ మండలంలోని ఉమ్మాపూర్ గ్రామ వీఆర్‌ఓ భీమయ్య లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. వివరాలు...నిజామాబాద్‌కు చెందిన మక్సూద్ అనే వ్యక్తికి పట్టాదారు పాసుపుస్తకం ఇవ్వడానికి రూ. 5000 లంచం డిమాండ్ చేశాడు. దీంతో దిక్కుతోచని మక్సూద్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో మక్సూద్ నుంచి భీమయ్య లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ రాందాస్ తేజ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
(వంగూర్)