
సాక్షి,విజయవాడ:వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి న్యూయార్క్ పర్యటనకు లైన్ క్లియర్ అయ్యింది. మిథున్‌రెడ్డి న్యూయార్క్ వెళ్లేందుకు ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. న్యూయార్క్‌లో జరగనున్న ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాలకు హాజరయ్యేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఐక్యరాజ్యసమితి సమావేశాల నిమిత్తం అక్టోబర్ 23 నుంచి నవంబర్ 4 వరకూ షరతులతో కూడిన అనుమతులు మంజూరు చేసింది.
ఈ మేరకు సిట్ అధికారులు జారీ చేసిన లుక్ అవుట్ నోటీసులు రద్దు చేయాలని ఆదేశించింది. న్యూయార్క్ పర్యటన వివరాలు కోర్టుకు సమర్పించాలని సూచించింది. పర్యటన ముగించుకుని వచ్చిన వెంటనే పాస్ పోర్టు సిట్ అధికారులకు అప్పగించాలని తెలిపింది.
ఐక్యరాజ్య సమితి సదస్సుల్లో పాల్గొనే భారత పార్లమెంటరీ బృందంలో సభ్యుడిగా మిథున్‌రెడ్డి అమెరికాలో పర్యటించేందుకు అనుమతి కోరుతూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన కోర్టు పైవిధంగా తీర్పును వెలువరించింది.