కనీస వేతనం అమలు చేయాలని కోరుతూ సోమవారం కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆరోగ్యశ్రీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు.
కరీంనగర్ : కనీస వేతనం అమలు చేయాలని కోరుతూ సోమవారం కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆరోగ్యశ్రీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు.
ట్రస్ట్ ఉద్యోగులుగా గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలని, క్షేత్రస్థాయి పర్యటనలకు అయ్యే ఖర్చు ట్రస్టే భరించాలని వారు డిమాండ్ చేశారు. మహిళా ఉద్యోగులకు జీతంతో కూడిన ప్రసూతి సెలవుల సౌకర్యం కల్పించి, హెల్త్ కార్డులు మంజూరు చేయాలని కోరారు.