లారీ ఢీకొని యువకుడి మృతి | a youth died in lorry collisioned incident | Sakshi
Sakshi News home page

లారీ ఢీకొని యువకుడి మృతి

Sep 4 2015 8:22 AM | Updated on Sep 18 2019 3:24 PM

క్వారీలో పనిచేస్తున్న యువకుడు లారీ డ్రైవర్ అజాగ్రత్తకు బలయ్యాడు. లారీలోని లోడ్ దించిన తర్వాత డ్రైవర్ వాహనాన్ని ముందుకు పోనియడానికి బదులు ఒక్కసారిగి వెనక్కి రావడంతో..

జగిత్యాల రూరల్(కరీంనగర్): క్వారీలో పనిచేస్తున్న యువకుడు లారీ డ్రైవర్ అజాగ్రత్తకు బలయ్యాడు. లారీలోని లోడ్ దించిన తర్వాత డ్రైవర్ వాహనాన్ని ముందుకు పోనియడానికి బదులు ఒక్కసారిగి వెనక్కి రావడంతో.. అక్కడే నిల్చొని ఉన్న యువకుడు లారీ వెనక చక్రాల కింద పడి మృతిచెందాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా సారంగపూర్ మండలం అర్పపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది.

వివరాలు.. గ్రామంలోని జోగుల పవన్ కుమార్(18) ఇటుక భట్టీలో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ రోజు ఉదయాన్నే లారీ నుంచి బూడిద లోడ్ దించాక అక్కడే నిల్చొని ఉన్న లావన్ కుమార్‌ను ముందుకు వెళ్లాల్సిన లారీ వెనక్కి వచ్చి ఢీకొట్టింది. దీంతో లారీ చక్రాల కిందపడి మృతిచెందాడు.

Advertisement
 
Advertisement
Advertisement