సెల్‌ఫోన్ చార్జింగ్ పెట్టబోయి యువకుడి బలి | A young boy died keeping charging | Sakshi
Sakshi News home page

సెల్‌ఫోన్ చార్జింగ్ పెట్టబోయి యువకుడి బలి

Jul 2 2015 2:48 AM | Updated on Sep 3 2017 4:41 AM

సెల్‌ఫోన్ చార్జింగ్ పెట్టబోయి యువకుడి బలి

సెల్‌ఫోన్ చార్జింగ్ పెట్టబోయి యువకుడి బలి

సెల్‌ఫోన్ చార్జింగ్ పెట్టబోయి ఓ యువకుడు మృతి చెందిన సంఘటన మండలంలోని పంచలింగాల్ గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది...

మక్తల్: సెల్‌ఫోన్ చార్జింగ్ పెట్టబోయి ఓ యువకుడు మృతిచెందిన సంఘటన మండలంలోని పంచలింగాల్ గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన చిన్నహన్మంతు, అంజలమ్మ కొడుకు నాగరాజు(28) ఉదయం సెల్‌ఫోన్ చార్జింగ్ పెట్టబోయి విద్యుత్‌షాక్‌కు గురయ్యాడు. ఈ సంఘటనలో సెల్‌చార్జర్ ముక్కలై నాగరాజు కిందపడిపోయాడు. చికిత్సకోసం ఆస్పత్రికి తరలించేలోగా మృతిచెందాడు. మృతుడు నాగరాజుకు మూడేళ్ల క్రితం వివాహం కాగా, భార్య, కూతురు ఉంది. కేసుదర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మురళీగౌడ్ తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement