కాళ్లతో పరీక్ష రాసి పది పాస్... | A student to write tenth exam his legs and passed | Sakshi
Sakshi News home page

కాళ్లతో పరీక్ష రాసి పది పాస్...

May 18 2015 3:32 AM | Updated on Sep 3 2017 2:14 AM

కాళ్లతో టెన్త్ పరీక్ష రాసిన వరంగల్ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండి హైస్కూల్‌కు చెందిన దారావత్ స్వామి ఉత్తీర్ణుడయ్యాడు.

దేవరుప్పుల: కాళ్లతో టెన్త్ పరీక్ష రాసిన వరంగల్ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండి హైస్కూల్‌కు చెందిన దారావత్ స్వామి ఉత్తీర్ణుడయ్యాడు. మండలంలోని దారావత్ తండాకు చెందిన స్వామి పుట్టుకతో అంగవైకల్యం పొందినప్పటికీ అధైర్యపడకుండా కడవెండి ప్రభుత్వ హైస్కూల్‌లో పదోతరగతి విద్యనభ్యసించాడు.

దేవరుప్పుల హైస్కూల్‌లో టెన్త్ పరీక్ష రాయడానికి అధికారులు అనుకూలమైన పరిస్థితిని కల్పించారు. దీంతో అతడికి వీలైన రీతిలో పరీక్ష రాయించారు. ఫలితాల్లో స్వామి 6.7 జీపీఏతోప్రతిభ కనబర్చాడు.

Advertisement
 
Advertisement
Advertisement