బండరాళ్లతో మోది వ్యక్తి హత్య | A person murdered in nalgonda district | Sakshi
Sakshi News home page

బండరాళ్లతో మోది వ్యక్తి హత్య

Jun 28 2015 5:26 PM | Updated on Sep 3 2017 4:32 AM

గుర్తుతెలియని వ్యక్తిని కొందరు దుండగులు బండరాళ్లతో మోది చంపిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది

నల్లగొండ: గుర్తుతెలియని వ్యక్తి (30)ని కొందరు దుండగులు బండరాళ్లతో మోది చంపిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం నందిపాడు గ్రామపంచాయతి పరిధిలోని ఏడుకోట్లతండ సమీపంలో గొర్రెల కాస్తున్న వ్యక్తులకు ఆదివారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కనిపించింది. దీంతో వాళ్లు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

మృతుడి వంటిపై ఉన్న దుస్తులు.. వేళ్లకు ఉన్న ఉంగరాలను బట్టి గొర్రెల కాపరిగా అనుమానిస్తున్నారు. గతంలో ఈ ప్రాంతంలో పాలమూరుకు చెందిన కొందరు గొర్లకాపరులు సంచరించినట్టు స్థానికులు చెబుతున్నారు. మృతదేహం నుంచి దుర్వాసన వస్తుండటంతో.. ఈ హత్య రెండు రోజుల కిందటే జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement