సెప్టల్ డిఫెక్ట్ అనే గుండె జబ్బుతో బాధపడుతున్న కొండా శరత్(11) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను చూడాలని కోరుకుంటున్నాడు.
కేసీఆర్‌ను కలవాలని ఓ హృద్రోగ బాలుడి కోరిక
సాక్షి, హైదరాబాద్: సెప్టల్ డిఫెక్ట్ అనే గుండె జబ్బుతో బాధపడుతున్న కొండా శరత్(11) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను చూడాలని కోరుకుంటున్నాడు. వివిధ రకాల జబ్బులతో బాధపడుతున్న పిల్లలను పరామర్శించడానికి ఏర్పాటైన ‘మేక్ ఏ విష్’ అనే అంతర్జాతీయ సంస్థ ప్రతినిధి ప్రియ తులూరి ఇటీవల ఆపోలో ఆసుపత్రిలో ఈ బాలుడిని కలిసినప్పుడు ఈ మేరకు వెల్లడించినట్లు సీఎం కార్యాలయం సీపీఆర్వో జ్వాల నర్సింహారావు తెలిపారు.
వరంగల్ జిల్లా నర్మెట్ట గ్రామానికి చెందిన బాలయ్య, భాగ్య దంపతుల సంతానమైన శరత్‌కు పుట్టుకతోనే హృద్రోగ సమస్య ఏర్పడింది. దీంతో మూడేళ్ల వయసు లో ఉన్నప్పుడు (2005)లో ఆపరేషన్ చేయించారు. అయితే తిరిగి సమ స్య పునరావృతం కావడంతో ఇటీవల మరోసారి ఆపరేషన్ జరిగింది.