సిద్దిపేట వైద్య కళాశాలలో నియామకాలు | requirement in siddipet medical college | Sakshi
Sakshi News home page

సిద్దిపేట వైద్య కళాశాలలో నియామకాలు

Sep 26 2017 1:46 AM | Updated on Oct 9 2018 7:39 PM

requirement in siddipet medical college - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేస్తున్న సిద్దిపేట ప్రభుత్వ వైద్య కాలేజీలో బోధన సిబ్బంది నియామక ప్రక్రియ మొదలైంది. ట్యూటర్, సీనియర్‌ రెసిడెంట్, జూనియర్‌ రెసిడెంట్‌ వంటి 38 కీలక పోస్టుల భర్తీకి వైద్య విద్య డైరెక్టరేట్‌ (డీఎంఈ) కార్యాలయం నోటిఫికేషన్‌ జారీ చేసింది. అన్ని పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలోనే భర్తీ చేయనున్నారు. పోస్టుల భర్తీ కోసం హైదరాబాద్‌లోని డీఎంఈ కార్యాలయంలో మంగళవారం ఉదయం 10 గంటల నుంచి 2 గంటల వరకు ఇంటర్వ్యూలు జరుగుతాయి.

వచ్చే ఏడాది నుంచి అడ్మిషన్లు
సిద్దిపేట వైద్య కాలేజీలో 2018–19 విద్యా సంవత్సరంలో అడిష్మన్లు జరిపేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. వైద్య కాలేజీ నిర్వహణ అనుమతి కోసం భారత వైద్య మండలి(ఎంసీఐ) బృందం త్వరలోనే సిద్దిపేట కాలేజీని సందర్శించనుంది. దీంతో సిబ్బంది నియామక ప్రక్రియ మొదలైంది. నిజాం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (నిమ్స్‌) తరహాలో సిద్దిపేట కాలేజీకి ప్రభుత్వం ప్రత్యేక ప్రతిపత్తి కలిగిస్తోంది. నియామకాలు, ఇతర ఏర్పాట్లు అన్ని స్వతంత్రంగానే జరుపుకొనే వెసులుబాటు కల్పించింది.

డిపార్ట్‌మెంట్‌              క్యాడర్‌                పోస్టులు
అనాటమీ                  ట్యూటర్‌               02
ఫిజియాలజీ               ట్యూటర్‌                02
బయోకెమిస్ట్రీ               ట్యూటర్‌                03
ఫార్మకాలజీ                ట్యూటర్‌                 01
ఫోరెన్సిక్‌ మెడిసిన్‌           ట్యూటర్‌             01
జనరల్‌ మెడిసిన్‌          ఎస్‌ఆర్‌                  03
జనరల్‌ మెడిసిన్‌             జేఆర్‌                 06
పిడియాట్రిక్స్‌                జేఆర్‌                   01
సైకియాట్రీ                      జేఆర్‌                01
జనరల్‌ సర్జరీ                   జేఆర్‌             06
ఆర్థోపెడిక్స్‌                    జేఆర్‌                02
ఓబీజీ                           ఎస్‌ఆర్‌              02
ఓబీజీ                               జేఆర్‌             04
క్యాజువాలిటీ              మెడికల్‌ ఆఫీసర్‌         04

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement