హత్య కేసులో ఆరుగురికి రిమాండ్ | 6 remand in murder case | Sakshi
Sakshi News home page

హత్య కేసులో ఆరుగురికి రిమాండ్

Aug 11 2015 2:22 PM | Updated on Aug 17 2018 2:53 PM

ఓ హత్య కేసులో ఆరుగురు నిందితులను రిమాండ్ కు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఖాజీపేట: ఓ హత్య కేసులో ఆరుగురు నిందితులను రిమాండ్ కు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా ఖాజీపేట మండలం కేంద్రంలో జరిగిన మీడియా సమావేశంలో పోలీసులు నిందితులను ప్రవేశపెట్టారు. మండలంలో ఈ నెల 2న సాంబయ్య అనే క్వారీ యజమానితో పాటు, గణపతి అనే వ్యక్తిని కొంతమంది దుండగులు హత్య చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితులైన శివరాత్రి ప్రసాద్, శివరాత్రి నారాయణ, శివరాత్రి కృష్ణ, శివరాత్రి శంకర్, కస్తూరి రవీందర్, కల్లూరి సుధాకర్‌లను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement