50 లక్షల విలువైన గుట్కా స్వాధీనం | 50 lakh worth Gutkha captured | Sakshi
Sakshi News home page

50 లక్షల విలువైన గుట్కా స్వాధీనం

Mar 22 2018 2:14 AM | Updated on Sep 26 2018 6:49 PM

50 lakh worth Gutkha captured - Sakshi

రాయదుర్గం: కర్ణాటకలోని బీదర్‌ నుంచి హైదరాబాద్‌కు భారీగా తరలి స్తున్న గుట్కా ప్యాకెట్లను  పోలీసులు  పట్టుకున్నారు. ఈ మేరకు డీసీపీ విశ్వప్రసాద్‌ వివరాలు వెల్లడించారు. రాష్ట్రంలో గుట్కాపై నిషేధం ఉండటంతో కొంతమంది బీదర్‌ నుంచి గుట్కా ప్యాకెట్లను తీసుకువచ్చి పాన్‌డబ్బాలు, కిరాణా షాపులకు సరఫరా చేస్తున్నారని తెలిపారు.  సమాచారమందుకున్న ఎస్‌వోటీ, చందానగర్, ఆర్‌సీపురం పోలీసులు దాడులు చేశారు.

11 వాహనాల్లో తరలిస్తున్న గుట్కాప్యాకెట్లను స్వాధీనం చేసుకుని 21 మందిని అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు. 202 బ్యాగుల గుట్కా, పాన్‌ మసాలాను సీజ్‌ చేశామన్నారు. బీదర్‌కు చెందిన నాధ్‌ఖాన్, మాలిక్‌ దినేశ్, జావీద్, ఫారుఖ్, సాల్మన్, భరత్, పాష , షెమ్మి, బాబిర్‌ పటేల్, అసాన్‌పటేల్‌ను అదుపులోకి తీసుకున్నామన్నారు.  గుట్కా స్వాధీనం చేసుకోవడంలో కీలకపాత్ర వహిం చిన ఎస్‌వోటీ అడిషనల్‌ డీసీపీ దయానంద్‌రెడ్డి, చందానగర్, ఆర్‌సీపురం సీఐలు తిరుపతిరావు, రాంచందర్‌రావు, ఎస్‌ఓటీ సీఐలు పురుషోత్తం, ప్రవీణ్‌రెడ్డి, కానిస్టేబుల్, సిబ్బందిని సైబరాబాద్‌ కమిషనర్‌ సజ్జనార్‌ అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement