ఐదేళ్ల చిన్నారిపై పెదనాన్న అత్యాచారం | 5 year old girl raped | Sakshi
Sakshi News home page

ఐదేళ్ల చిన్నారిపై పెదనాన్న అత్యాచారం

Dec 8 2015 8:23 PM | Updated on Jul 28 2018 8:53 PM

ఐదేళ్ల బాలికపై పెదనాన్న నీచ కార్యానికి పాల్పడ్డాడు. రంగారెడ్డి జిల్లా మంచాల మండల కేంద్రంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

మంచాల (రంగారెడ్డి) : ఐదేళ్ల బాలికపై పెదనాన్న నీచ కార్యానికి పాల్పడ్డాడు. రంగారెడ్డి జిల్లా మంచాల మండల కేంద్రంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఎస్‌ఐ యాదగిరి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గుంటి శ్రీనివాస్(45) సోమవారం సాయంత్రం కూతురు వరుసయ్యే ఐదేళ్ల బాలికను తన ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఈ విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు మంగళవారం మంచాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. కాగా, శ్రీనివాస్ ఇద్దరు భార్యలు గతంలో చనిపోయారని, ఆయన మద్యానికి బానిసయ్యాడని స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement