స్వైన్‌ఫ్లూతో మరో ఐదుగురు మృతి | 5 persons died with swine flu | Sakshi
Sakshi News home page

స్వైన్‌ఫ్లూతో మరో ఐదుగురు మృతి

Feb 12 2015 9:13 PM | Updated on Sep 2 2017 9:12 PM

గ్రేటర్‌ హైదరాబాద్లో చలి తగ్గుముఖం పట్టినా స్వైన్‌ఫ్లూ తీవ్రత మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది.

హైదరాబాద్ సిటీ: గ్రేటర్‌ హైదరాబాద్లో చలి తగ్గుముఖం పట్టినా స్వైన్‌ఫ్లూ తీవ్రత మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా గురువారం రాష్ట్రంలో ఐదుగురు మృతి చెందారు. వీరిలో అజంపురకు చెందిన 39 ఏళ్ల, మరో ఇద్దరు అవేర్‌గ్లోబల్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. పరిస్థితి విషమించడంతో వీరిని బుధవారం రాత్రి గాంధీ ఆసుపత్రికి తరలించగా, గురువారం ఉదయం ముగ్గురు చనిపోయారు. అదే విధంగా కరీంనగర్ జిల్లాకు చెందిన వ్యక్తి అపోలో ఆస్పత్రిలో చనిపోగా, ప్రకాశం జిల్లాకు చెందిన వ్యక్తి స్టార్ ఆస్పత్రిలో మరణించాడు. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో 21 పాజిటీవ్, 23 అనుమానిత కేసులు ఉండగా, ఫీవర్ ఆస్పత్రిలో 14 పాజిటీవ్, ఎమినిది మంది అనుమానితులు చికిత్స పొందుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement