నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం | 4 years old girl raped | Sakshi
Sakshi News home page

నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం

Jan 22 2016 3:22 PM | Updated on Jul 28 2018 8:53 PM

ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిపై ఓ పదిహేనేళ్ల బాలుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అభం శుభం తెలియని చిన్నారిపై లైంగిక దాడి చేయడంతో.. చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది.

అశ్వరావుపేట (ఖమ్మం) : ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిపై ఓ పదిహేనేళ్ల బాలుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అభం శుభం తెలియని చిన్నారిపై లైంగిక దాడి చేయడంతో.. చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన ఖమ్మం జిల్లా అశ్వరావుపేట మండలం అచ్యుతాపురం గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది.

గ్రామానికి చెందిన నాలుగేళ్ల చిన్నారి ఇంటి ముందు ఆడుకుంటున్న సమయంలో అదే గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలుడు.. పాపను తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో బాలిక పరిస్థితి విషమంగా మారింది. ఇది గుర్తించిన స్థానికులు బాలికను ఆస్పత్రికి తరలించి నిందితుడిని పోలీసులకు అప్పగించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న డీఎస్పీ కవిత నిందితుడిని అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement