వడదెబ్బతో నలుగురి మృతి | 4 died due to sun strock | Sakshi
Sakshi News home page

వడదెబ్బతో నలుగురి మృతి

Apr 23 2015 2:20 AM | Updated on Sep 3 2017 12:41 AM

తెలంగాణలోని పలు జిల్లాలో బుధవారం వడదెబ్బకు నలుగురు మృతి చెందారు.

సాక్షి, నెట్‌వర్క్: తెలంగాణలోని పలు జిల్లాలో బుధవారం వడదెబ్బకు నలుగురు మృతి చెందారు. నల్లగొండ జిల్లా ఆత్మకూర్(ఎం) మండలం చందెపల్లికి చెందిన గం గరాజు సత్తయ్య(55) బుధవారం బైక్‌పై మూటకొండూరుకు వెళ్లాడు. మధ్యాహ్నం తిరిగివస్తూ  ఎండకు సొమ్మసిల్లి పడిపోయి మృతి చెందాడు.

ఇదే జిల్లా మోత్కూర్ మండలకేంద్రంలోని గాంధీనగర్ కాలనీకి చెందిన కూరెళ్ల మల్లమ్మ(75), ఆదిలాబాద్ జిల్లా కౌటాల మండలం పార్డి కంబారీవాసి ఎం. పోశయ్య(60), నిజామాబాద్ జిల్లా బాన్సువాడ మండలం కొల్లూర్‌వాసి షేక్‌అలిమా(40) వడదెబ్బతో మరణించారు.
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement