అంగన్‌వాడీ కేంద్రంలో పేలిన ప్రెషర్‌ కుక్కర్ | 3 injured in pressure cooker blast | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీ కేంద్రంలో పేలిన ప్రెషర్‌ కుక్కర్

Feb 4 2016 6:26 PM | Updated on Apr 3 2019 3:52 PM

జిల్లా కేంద్రంలోని కరీమాబాద్ 64వ అంగన్‌వాడీ కేంద్రంలో గురువారం ప్రమాదవశాత్తు ప్రెషర్ కుక్కర్ పేలింది .

కరీమాబాద్ (వరంగల్) : వరంగల్ నగరం కరీమాబాద్ కాశికుంటలోని అంగన్‌వాడీ కేంద్రంలో గురువారం మధ్యాహ్నం ప్రెషర్ కుక్కర్ పేలి ఆయాతోపాటు ఇద్దరు పిల్లలకు గాయాలయ్యాయి. స్థానిక 64వ అంగన్ వాడీ కేంద్రంలో రోజు మాదిరిగానే పిల్లలకు భోజనం తయారుచేస్తున్నారు. ఈ క్రమంలో ఆయాగా పనిచేస్తున్న అరుణ ప్రెషర్ కుక్కర్‌లో పప్పు, పాలకూర వేసి  స్టవ్ మీద పెట్టింది.

కాసేపటి తర్వాత ఉడికిందో లేదో తెలుసుకునేందుకు కుక్కర్ విజిల్‌ను కొద్దిగా పైకి లేపింది. కుక్కర్ మూత అకస్మాత్తుగా పైకెగిరిపోవడంతో అందులోని వేడి వేడి పప్పు, పాలకూర అక్కడే ఉన్న పిల్లలు శివరాత్రి రిషి(5), శివరాత్రి శ్రావణి(5)లతో పాటు ఆయా అరుణలపై పడింది. గాయాలపాలైన ఆయాను, పిల్లలను 108 లో ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement