వరంగల్ జిల్లా మెర్కొండ మండలం అమీన్‌పేట సమీపంలో గురువారం అర్థరాత్రి ప్రయాణిస్తున్న వ్యాను బోల్తాపడింది.
వరంగల్ జిల్లా: వరంగల్ జిల్లా మెర్కొండ మండలం అమీన్‌పేట సమీపంలో గురువారం అర్థరాత్రి ప్రయాణిస్తున్న వ్యాను బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 20 మందికి గాయాలయ్యాయి, వీరిలో నలుగరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను నర్సంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స అందిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన వారిని వరంగల్ ఎంజీఎంకు తరలించారు.