
నిప్పంటించుకుని బాలిక బలవన్మరణం
పదో తరగతి చదువుతున్నఓ బాలిక ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
మల్యాల: పదో తరగతి చదువుతున్నఓ బాలిక ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా మల్యాల మండలంలో చోటు చేసుకుంది. మండల కేంద్రానికి చెందిన రుద్రవేని దేవయ్య, నర్సవ్వ కుమార్తె మానస(14) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. సోమవారం ఉదయం తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లగా మానస ఇంట్లోనే ఉండిపోయింది.
కొద్దిసేపటి తర్వాత ఆమె ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. చుట్టుపక్కల వారు అప్రమత్తమై వచ్చేలోపల తీవ్ర గాయాలతో చనిపోయింది. స్థానిక యువకుల వేధింపులే బాలిక ఉసురు తీశాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.