‘రెడ్ మి 4’ కమింగ్ సూన్..ధర ఎంత?
చైనా మొబైల్ దిగ్గజం షియోమి రెడ్ మి సిరీస్ లో భాగంగా ' రెడ్ మి 4' స్మార్ట్ ఫోన్ ను ఇండియాలో లాంచ్ చేసేందుకు రడీ అవుతోంది.
	ముంబై: స్మార్ట్‌ఫోన్లతో ప్రపంచవ్యాప్తంగా ఫోన్ లవర్స్‌ను ఆకట్టుకుంటున్న చైనా మొబైల్ దిగ్గజం షియోమి మరింత వేగంగా దూసుకుపోతోంది.  రెడ్ మి సిరీస్ లో భాగంగా తాజాగా ' రెడ్ మి 4' స్మార్ట్ ఫోన్ ను ఇండియాలో  లాంచ్ చేసేందుకు రడీ అవుతోంది.  అతిచవక ధరలో ఆ స్మార్ట్‌ఫోన్ ను మే 16న  ఒక ప్రత్యేక  కార్యక్రమంలో లాంచ్ చేయనుంది. ఎక్స్ సిరీస్‌లో అతి ఖరీదైన డివైస్‌లను లాంచ్ చేసిన సంస్థ,  రెడ్ మి 3 కి అప్గ్రేడెడ్ వెర్షన్ గా రెడ్ మి 4 ను స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్ తో వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానుంది.  దీని ధరను చౌక ధరలో సుమారు  రూ.8వేలుగా నిర్ణయించనుందని తెలుస్తోంది. లుక్స్‌లో రెడ్ మి3, 3 ఎస్ ను పోలి ఉండి, మెటల్ యూనిబాడీ డిజైన్‌త  వెనుక ప్యానెల్లో వేలిముద్ర స్కానర్ కూడా  పొందుపరిచింది. అలాగే అతి తక్కువ ధరలో స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్, 2 జీబీర్యాం, 16 జీబీ స్టోరేజ్  వేరియంట్‌ను కూడా లాంచ్ చేయనుంది.  దీని ధర  ఇండియాలో సుమారు రూ. 6,905గా ఉండనుంది.  
	షియామి వైస్ ప్రెసిడెంట్, ఎండీ, మను కుమార్ రెడ్‌మి మరో స్మార్ట్‌ఫోన్ లాంచ్ అవుతోందని ఇటీవల ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈనెలలో ఇదిరెండవ అతిపెద్ద ప్రకటన కానుందంటూ ట్వీట్ చేయడంతో మరిన్ని ఆసక్తి నెలకొంది. రెడ్ మి 4 ఫీచర్లపై అంచనాలు ఈ విధంగా ఉన్నాయి.
	రెడ్ మి 4 ఫీచర్లు
	5 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్‌ప్లే
	ఆండ్రాయిడ్ 6.0మార్షమల్లౌ
	1.4 ఆక్టా కోర్ ప్రాపెసర్
	3జీబీ ర్యామ్
	 32జీబీ ఇంటర్నెట్ మొమరీ,
	మైక్రో ఎస్‌డీ కార్డ్ ద్వారా 128జీబీ దాకా విస్తరించుకునే సౌకర్యం
	 13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా
	5మెగాపిక్సెల్  సెల్పీ   కెమెరా
	4,100 ఎంఏహెచ్ బ్యాటరీ
	 
Announcing the launch of a new Redmi phone! This will be the 2nd BIG announcement of the month ☺️ Coming soon. Stay tuned #PowerInYourHand pic.twitter.com/jvzGCY2oyR
— Manu Kumar Jain (@manukumarjain) May 5, 2017

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
