మోటో కొత్త ఫోన్..టీజర్ వచ్చేసింది | Moto Z2 Play to launch in India on June 8, confirms Motorola teaser | Sakshi
Sakshi News home page

మోటో కొత్త ఫోన్..టీజర్ వచ్చేసింది

Jun 5 2017 12:48 PM | Updated on Sep 5 2017 12:53 PM

మోటో కొత్త ఫోన్..టీజర్ వచ్చేసింది

మోటో కొత్త ఫోన్..టీజర్ వచ్చేసింది

స్మార్ట్ ఫోన్ మార్కెట్లో మంచి జోరుమీదున్న మోటోరోలా మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ ను భారత మార్కెట్లోకి తీసుకురాబోతుంది.

స్మార్ట్ ఫోన్ మార్కెట్లో మంచి జోరుమీదున్న మోటోరోలా మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ ను భారత మార్కెట్లోకి తీసుకురాబోతుంది. మోటో జెడ్2 ప్లే పేరుతో ఈ కొత్త స్మార్ట్ ఫోన్ జూన్ 8న భారత్ లో లాంచ్ చేయనున్నట్టు కంపెనీ టీజర్ విడుదల చేసింది. ప్రీ-ఆర్డర్లు కూడా ఆ రోజు నుంచే ప్రారంభించనున్నట్టు మోటో ఇండియా ఆదివారం ఓ ట్వీట్ చేసింది. గతేడాది మార్కెట్లోకి వచ్చిన మోటో జెడ్ ప్లేకు సక్సెసర్ గా దీన్ని ప్రవేశపెడుతున్నారు. మెరుగుపరిచిన కెమెరా, ప్రాసెసర్, స్పెషిఫికేషన్లు ఈ ఫోన్లో ఉండబోతున్నాయి. '' భారీ ఫోన్ కు ఇక గుడ్ బై చెప్పండి. నున్నగా ఉండే రీ-డిఫైన్డ్ మోటో జెడ్2 ప్లేకు హలో చెప్పండి!'' అంటూ కంపెనీ ఆదివారం ఓ ట్వీట్ చేసింది. అమెరికాలో ఈ ఫోన్ 499 డాలర్లు కాగ, భారత్ లో దీని ధర 25వేల రూపాయల నుంచి 30వేల రూపాయల వరకు ఉండొచ్చని తెలుస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ ను కంపెనీ అధికారిక వెబ్ సైట్ నుంచి ప్రీ-బుకింగ్ చేసుకోవచ్చని పేర్కొంది. అయితే ఈ ఫోన్ ను ఎక్కడ అందుబాటులో ఉంచుతుందో తెలుపలేదు. 
 
ఇక ఈ ఫోన్ స్పెషిఫికేషన్స్ వివరాల్లోకి వస్తే... 
5.5 అంగుళాల ఫుల్ హెచ్డీ సూపర్ అమోలెడ్ డిస్ ప్లే
కార్నింగ్ గొర్రిల్లా గ్లాస్ 3
32జీబీ/64జీబీ స్టోరేజ్ ఆప్షన్లు
2టీబీ వరకు విస్తరణ మెమరీ
12ఎంపీ ప్రైమరీ కెమెరా
3జీబీ లేదా 4జీబీ ర్యామ్
5ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్
ఆండ్రాయిడ్ 7.1.1 నోగట్
ఆక్టా-కోర్ స్నాప్ డ్రాగన్ 626 ప్రాసెసర్
3000 ఎంఏహెచ్ బ్యాటరీ
గతవారమే మోటోరోలా మోటో సీ స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. మోటో ఈ4, మోటో ఈ4 ప్లస్ స్మార్ట్ ఫోన్లను కంపెనీ ఆవిష్కరించనుందని టెక్ వర్గాలు అంచనావేస్తున్నాయి. 
Advertisement
 
Advertisement
Advertisement