అమెజాన్‌ ఆపిల్‌ ఫెస్ట్‌: డిస్కౌంట్‌, ఎక్స్చేంజ్‌ ఆఫర్స్‌ | Amazon Apple Fest offers Rs 1,500 cashback, discounts & more across range | Sakshi
Sakshi News home page

అమెజాన్‌ ఆపిల్‌ ఫెస్ట్‌: డిస్కౌంట్‌, ఎక్స్చేంజ్‌ ఆఫర్స్‌

Aug 28 2017 3:28 PM | Updated on Aug 14 2018 4:01 PM

అమెజాన్‌ ఆపిల్‌ ఫెస్ట్‌: డిస్కౌంట్‌, ఎక్స్చేంజ్‌ ఆఫర్స్‌ - Sakshi

అమెజాన్‌ ఆపిల్‌ ఫెస్ట్‌: డిస్కౌంట్‌, ఎక్స్చేంజ్‌ ఆఫర్స్‌

అమెజాన్‌ ఇండియా రెండు రోజుల ఆపిల్‌ ఫెస్టివల్‌కు తెరతీసింది.

సాక్షి, న్యూఢిల్లీ: అమెజాన్‌ ఇండియా రెండు రోజుల ఆపిల్‌ ఫెస్టివల్‌కు తెరతీసింది. ఈ ఫెస్టివల్‌లో ఐఫోన్లు, వాచ్‌లు, ఐప్యాడ్‌లు, ఐమ్యాక్‌లపై డిస్కౌంట్లను, క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లను అమెజాన్‌ ప్రకటించింది. నేడు, రేపు ఈ ఫెస్టివల్‌ జరుగనుంది. ఈ ఫెస్టివల్‌లో భాగంగా అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ కార్డుహోల్డర్స్‌పై రూ.1500 క్యాష్‌బ్యాక్‌ను అమెజాన్‌ అందిస్తోంది. అంతేకాక ఐఫోన్‌ 7, ఐఫోన్‌6, ఐఫోన్‌ ఎస్‌ఈ స్మార్ట్‌ఫోన్లు డిస్కౌంట్‌ ధరలో అందుబాటులో ఉన్నాయి. ఐఫోన్‌ 7, 32జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ డివైజ్‌ ధర రూ.56,200 కాగ, ఈ ఫోన్‌ 11,201 రూపాయల డిస్కౌంట్‌తో 44,999 రూపాయలకే అందుబాటులో ఉంది. డిస్కౌంట్‌తో పాటు ఎక్స్చేంజ్‌ ఆఫర్‌ కింద పాత డివైజ్‌తో ఎక్స్చేంజ్‌లో ఐఫోన్‌ 7ను కొనుగోలు చేయాలనుకుంటే 14,920 రూపాయల వరకు తగ్గింపు లభిస్తోంది.
 
ఇక 32జీబీ స్టోరేజ్‌ కలిగిన ఐఫోన్‌ 6 ధర 29,500 రూపాయలు కాగ, ఈ డివైజ్‌ కూడా 3,501 రూపాయల డిస్కౌంట్‌లో 25,999కే అందుబాటులోకి వచ్చింది. ఐఫోన్‌ 6పై కూడా ఎక్స్చేంజ్‌ ఆఫర్‌ కింద 14,920 రూపాయల వరకు తగ్గింపును అమెజాన్‌ అందిస్తోంది. ఆపిల్‌కు చెందిన మరో ఫేమస్‌ స్మార్ట్‌ఫోన్‌ ఐఫోన్‌ ఎస్‌ఈ కూడా డిస్కౌంట్‌ ధరలో అందుబాటులో ఉంది. ఐఫోన్‌ ఎస్‌ఈ అసలు ధర 26వేల రూపాయలు కాగ, 7,001 రూపాయల డిస్కౌంట్‌లో 25,999 రూపాయలకే ఈ ఫోన్‌ను వినియోగదారులు కొనుగోలు చేసుకోవచ్చు. ఎక్స్చేంజ్‌ ఆఫర్‌ కింద ఈ ఫోన్‌పై కూడా 14,920 రూపాయల వరకు తగ్గింపు లభిస్తోంది. ఆపిల్‌ స్మార్ట్‌వాచ్‌లపై 3000 రూపాయల తగ్గింపు, ఐప్యాడ్‌లపై ఎలాంటి ఖర్చులు లేని ఈఎంఐలు, ఎక్స్చేంజ్‌ ఆఫర్లను అమెజాన్‌ అందిస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement