శ్రీ రాఘవేంద్రునిపై రజనీ అమితమైన భక్తి.. భారీ విరాళం | rajini kant visit sri raghavendra swamy temple | Sakshi
Sakshi News home page

Nov 22 2017 8:28 PM | Updated on Nov 22 2017 8:47 PM

rajini kant visit sri raghavendra swamy temple - Sakshi

తమిళసినిమా: సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌కు మంత్రాలయ శ్రీ రాఘవేంద్రస్వామి అంటే అమిత భక్తి. ఆయన తాజాగా మంత్రాలయంలో రాఘవేంద్రస్వామిని దర్శించుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మంత్రాలయంలో శ్రీ మఠానికి రూ. 20 కోట్లను విరాళంగా అందించారు. రజనీకాంత్‌ మంగళవారం ఉదయం రాఘవేంద్ర స్వామిని దర్శించుకుని విశేష పూజలు నిర్వహించిన సంగతి తెలిసిందే.

శ్రీ మఠానికి వచ్చిన ఆయనకు అర్చకులు సాదర స్వాగతం పలికి సత్కరించారు. అనంతరం రజనీకాంత్‌ మఠాధిపతి సుబుదేంద్రతీర్థులను కలిసి కొంచెం సేపు చర్చించారు. మఠంలో నిర్మాణాలు శిధిలావస్థకు చేరుకున్నాయని, భక్తులకు వసతుల అవసరం ఉందని తెలుసుకున్నారు. దీంతో మఠం ఆధునీకరణకు రూ.20 కోట్లను విరాళంగా అందించారు. ఆ నిధితో భక్తుల బస కోసం 25 ఏసీ గదులను, మరిన్ని వసతి గదులను నిర్మించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement