రాజీవ్‌ హంతకురాలు నళినికి పెరోల్

The Madras High Court Granted Parole to Rajiv's Killer - Sakshi

సాక్షి, చెన్నై: మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న నళిని శ్రీహరన్‌కి మద్రాస్‌ హైకోర్టు 30 రోజుల పెరోల్‌ మంజూరు చేసింది. గత 28 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్న నళిని, సుదీర్ఘకాలం జైలు జీవితం గడిపిన మహిళగా కూడా గుర్తింపు పొందారు. తన కూమార్తె వివాహానికి ఆరు నెలలు పెరోల్‌ కావాలని, తాను స్వయంగా వాదించుకుంటానని మద్రాస్‌ హైకోర్టును ఆమె ఏప్రిల్‌లో కోరింది. కోర్టు అనుమతి మేరకు కోర్టులో స్వయంగా వాదనలు వినిపించింది. అయితే నళినికి ఆరు నెలలు ఇవ్వలేమనీ, ఇతర సాధారణ ఖైదీల్లాగే 30 రోజుల పెరోల్‌ను కోర్టు మంజూరు చేసింది.

1991, మే నెలలో ఎన్నికల ప్రచారం నిమిత్తం వైజాగ్‌ నుంచి తమిళనాడులోని శ్రీ పెరుంబుదూర్‌కి వెళ్లిన ఆనాటి ప్రధాన మంత్రి రాజీవ్‌ గాంధీని ఎల్‌టీటీఈ ఆత్మాహుతి దళ సభ్యులు బాంబు పేల్చి హతమార్చారు. ఈ కేసులో ఏడుగురిని అరెస్టు చేయగా, అందులో నళిని ఒకరు.

Read latest Tamil Nadu News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top